
నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని కిష్టపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును జిల్లా సిపి అంబర్ కిషోర్ ఝా అకస్మికంగా తనిఖీ చేశారు. చెక్ ఫోస్ట్ ద్వారా వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా డబ్బులు తీసుకువెళ్లే వ్యక్తులకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలఅన్నారు. చెక్ పోస్ట్ గుండా డబ్బు, మద్యం సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేయాలన్నారు. వాహనదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని హితబోధ చేశారు. తదుపరి స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించి పరిశీలించారు. ఈ తనిఖీల్లో వర్ధన్నపేట ఏసీపీ రఘు చందర్, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ విజయ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సూర్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.