పోరాడే వారిని గెలిపించండి

– అవకాశవాద రాజకీయాలను ఎండగట్టండి
– కార్యకర్తల సమావేశంలో పోతినేని, సాయిబాబు
నవతెలంగాణ-ముదిగొండ
ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే శక్తులను గెలిపించి, అవకాశవాద రాజకీయాలను ఎండగట్టాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో సిపిఐ(ఎం) రెండవ శాఖ కార్యదర్శి ఇరుకు నాగేశ్వరరావు అధ్యక్షతన కార్యకర్తల విస్తత సమావేశం మంగళవారం రాత్రి జరిగింది.ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు సమీకరణలపై సీపీఐ(ఎం) ఎన్నికల బరిలో పోటీ చేయాల్సిన ఆవశ్యకతను కార్యకర్తలకు ఆయన వివరించారు. ఎన్నికల బరిలో తమతో కలిసి వచ్చే లౌకికవాద శక్తులతో కలిసి పని చేస్తామన్నారు. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఓడించి, ప్రజా కార్మిక పోరాటాల ద్వారా ప్రభుత్వం మెడల వంచిన పాలడుగు భాస్కర్‌ ను గెలిపించాలన్నారు. సిఐటియు జాతీయ కోశాధికారి మందడపు సాయిబాబా మాట్లాడుతూ కార్మిక ఉద్యమ నాయకులు పాలడుగు భాస్కర్‌ మధిర ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారని, భాస్కర్‌ విజయానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి వరప్రసాద్‌, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్‌ ఎంపీపీ మంకెన దామోదర్‌, నాయకులు మందరపు వెంకన్న, పద్మ, వేల్పుల భద్రయ్య, పుచ్చకాయల లక్ష్మయ్య, నెమలి సైదులు, బట్టు రాజు, మెట్టెల సతీష్‌ పాల్గొన్నారు.
పాలడుగు భాస్కర్‌ ను గెలిపించాలి
ఎర్రుపాలెం : మధిర నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పాలడుగు భాస్కర్‌ పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిఐటియు మండల ఆర్గనైజర్‌ సగుర్తి సంజీవరావు తెలిపారు. మండల కేంద్రంలోని రామిశెట్టి పుల్లయ్య భవనం నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలడుగు భాస్కర్‌ ఈ నెల 10న మధిరలో నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వ్యకాస మండలాధ్యక్షుడు గామాసు జోగయ్య, వృత్తి సంఘం నాయకులు నాగులవంచ వెంకటరామయ్య, నాయకులు దూదిగం బసవయ్య, కోటి సుబ్బారెడ్డి, దూదిగం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : మధిర నియోజకవర్గ సిపిఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఐ(ఎం) మండల నాయకులు టిఎస్‌ కళ్యాణ్‌ అన్నారు. మండల పరిధిలో పెద్దమండవలో సిపిఐ(ఎం) గ్రామ విస్తృత స్థాయి సమావేశం గ్రామశాఖ కార్యదర్శి మాదారపు శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గురువారం మధిరలో పాలడుగు భాస్కర్‌ నామినేషన్‌ వేయనున్నట్లు ఆయన చెప్పారు.నామినేషన్‌ సందర్భంగా జరిగే ర్యాలీ,బహిరంగసభలో గ్రామం నుండి అధికసంఖ్యలో పార్టీ కార్యకర్తలు,ప్రజలు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని టీఎస్‌ కళ్యాణ్‌ కోరారు.అనంతరం పాలడుగు భాస్కర్‌ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామములో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు కందిమల్ల తిరుపతి,గ్రామ నాయకులు మాదారపు సత్యనారాయణ, యడ్లపల్లి నరసింహారావు, అబ్బూరి బుచ్చిబాబు, అబ్బూరి ప్రసాద్‌, తోటకూరి బసవయ్య, తాళ్లూరి రామనాథం, సిరికొండ సత్యంరాజు, గుత్తికొండ వెంకటేశ్వర్లు, ఎర్రగుంట్ల మైసూర్‌, మాదారపు రామాంజనేయులు, సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love