Sunday, April 26, 2026
E-PAPER
Homeకవితయుద్ధ నీతి

యుద్ధ నీతి

- Advertisement -

అవని ఆపతి పడుతుంది.
తనకోసంకాదు మనకోసం.
గాలి గాయాల్ని దిగమింగుకొని వీస్తుంది.
తన ఊపిరికొసం కాదు…మన ఊపిరి కోసం.
భానుడు తిమిరాన్ని చీల్చుకొని మళ్ళీ ఉదయిస్తున్నాడు..
కొత్తరోజును ప్రసాధిస్తున్నాడు.
భూమి రక్తంతో తడిసిపోతుంటే..
శవాలను శిలాజాలుగా తన ఒడిలో
దాచిపెట్టుకుంటుంది ప్రకృతి.
గాయాల చరిత్రను రేపటి తరానికి చెప్పడానికి.!
వెచ్చనిరుధిరం ఎప్పటికి ఆరిపోని పారాణిలా
అంటుకుంటుంది కాళ్లకు.!
రేపటిభవిష్యత్తు కళ్లలో… సమాధానం లేని ప్రశ్నలు.??
యుద్ధపు పొగలు ఊపిరాడని మేఘాలై కమ్ముకున్నాయి.
అగ్రరాజ్యం అహంకారానికి..
ప్రాణాలు సమిదలై దహించుకపోతున్నాయి.
ఎక్కడో పచ్చిమాసియాలో ప్రకంపనలు
ప్రతిపల్లె పట్నం ఇళ్లలో అల్లుకుంటున్న పొగలు.
యుద్ధం చరిత్రఅంతా తడిసిన రక్తంతో ఇంకా
తడిగానే ఉంది.
అసలైన పేదరికి యుద్ధం ఆకలి రణం
ఇపుడు ఆవిరైన నీతిబిందువులు.
కంటికి కనబడని కంటికి చిక్కని బతుకు బాధలు.
అహంకారపు యుద్ధంలో చిన్నాభిన్నమైన ఆర్థిక
ప్రగతి… అందని ద్రాక్షగా రేపటి భవిష్యత్తు.
అశోక్‌ గోనె, 9441317361

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -