Friday, July 24, 2026
E-PAPER
Homeకవితఎలుగుబంటి

ఎలుగుబంటి

- Advertisement -

అవును
ఎలుగుబంటి నా మీద దాడిచేసింది
కనబడకుండా పోయిన తన పిల్లల్ని
రక్షించే పనిలోనే వున్నాను నేను
ఎలుగు బంటి
హాని తలపెడుతున్నానుకుంది
దాడిచేసింది నామీద ఎలుగుబంటి
అడవి తగలబడుతోంది
బిడ్డను కాపాడుకునే హడావిడిలో
ఎలుగుబంటికి నేనేం చేస్తున్నానో
బోధపడుతుందా?
తల్లికదా
ఎలుగుబంటి నా మీద దాడిచేసింది
పూర్తిగా తగలబడి బూడిదైంది అడవి
బూడిదలోంచి ఒక పువ్వు
బూడిదలోంచి మాత్రమే పూయగలిగే
ఒక పువ్వు పూసింది
దాని పరిమళం సోకి
ఎలుగుబంటి తలెత్తి నన్ను చూసింది
నవ్వుతూ వున్న తనపిల్ల చేతిలో
నేను బహుమతిగా ఇచ్చిన
పువ్వు మరింత వికసించి
తనూ నవ్వింది
నాకు చేసిన గాయాలు చూసి
ఎలుగుబంటి సిగ్గుపడింది
అవి మానటం మొదలైందని తెలిసి
తృప్తిగా నాకేసి చూస్తూ నవ్వింది కూడా!


చిత్తలూరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -