Friday, September 11, 2026
E-PAPER
Homeకవితబొద్దింకల పోరాటం

బొద్దింకల పోరాటం

- Advertisement -

తలలు పగిలారు, రక్తాలు చిందారు
చేతులు విరిగారు, కాళ్ళు విరిగారు
ప్రశ్నా పత్రాల లీకేజీలు
ఎదురు తిరిగిన జెన్జీలు
దెబ్బలు తిన్న శరీరాలు
విరిగిన లాఠీలు
వాటర్‌ ట్యాంక్‌లకి అదరలేదు
టియర్‌ గ్యాస్‌లకి బెదరలేదు
అన్యాయాన్ని ఎదిరించడానికి
జంతర్‌ మంతర్‌లో
వేల బొద్దింకలు ఒకటై చేసిన పోరాటం
దిగివచ్చిన ప్రభుత్వం
ఈ బొద్దింకలు చీకట్లలో పాకేవి కాదు
చీకట్లను పారద్రోలి
వెలుగు కోసం పోరాడేవి.
కోనేటి నరేష్‌, 8499847863

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -