– రాయల్స్‌పై 5 వికెట్లతో ఘన విజయం
– అభిషేక్, కిషన్ అర్థ సెంచరీలు
– సూర్యవంశీ ధనాధన్ సెంచరీ వృథా
– రాజస్తాన్ 228/6
– హైదరాబాద్ 229/5
నవతెలంగాణ-జైపూర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ చితక్కొట్టింది. ఛేదనలో మరోసారి చెలరేగింది. రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు ఉండగానే ఛేదించింది. 18.3 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీజన్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (57, 29 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (74, 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగటంతో ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఎదురులేదు. ఓపెనర్ ట్రావిశ్ హెడ్ (6) తొలి బంతికే జీవనదానం పొందినా.. సద్వినియోగం చేసుకోలేదు. అభిషేక్, ఇషాన్ కిషన్‌లు రెండో వికెట్‌కు 55 బంతుల్లోనే 132 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ దూసుకెళ్లింది. అభిషేక్, కిషన్‌లు 24 బంతుల్లోనే అర్థ సెంచరీలు సాధించి రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. సాధించాల్సిన రన్‌రేట్‌ను నేలకు దించిన తర్వాత ఈ ఇద్దరు నిష్క్రమించినా.. హెన్రిచ్ క్లాసెన్ (29, 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (36, 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. నితీశ్ 3 సిక్సర్లతో ఫామ్ చాటుకోగా.. క్లాసెన్ బాధ్యతాయుతంగా ఆడాడు. సాలిల్ అరోరా (8 నాటౌట్), అనికెత్ వర్మ (1 నాటౌట్) ఆఖర్లో లాంఛనం ముగించారు. రాయల్స్ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా.. సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేయలేదు. జోఫ్రా ఆర్చర్ (2/34), బ్రిజేశ్ శర్మ (2/44) రెండేసి వికెట్లు పడగొట్టారు. పేలవ ఫీల్డింగ్ రాయల్స్‌ను రేసులో లేకుండా చేశాయి.
వైభవ్ విధ్వంసం
యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (103, 37 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లోనే సెంచరీ సాధించి సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికారేశాడు. ఏడు సిక్స్‌లు, ఓ బౌండరీతో 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన వైభవ్.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించాడు. యశస్వి జైస్వాల్ (10) నిరాశపరిచినా.. ధ్రువ్ జురెల్ (51,35 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి వైభవ్ శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇద్దరు నిష్క్రమించిన తర్వాత రాయల్స్ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. రియాన్ పరాగ్ (7), హెట్‌మయర్ (11) తేలిపోయారు. ఫెరీరా (33) మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో రాయల్స్‌కు మంచి ముగింపు అందించాడు. జడేజా (4 నాటౌట్), ఆర్చర్ (2 నాటౌట్) ఆఖర్లో దూకుడుగా ఆడటంలో విఫలం అయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఈషన్ మలింగ (2/38) రాణించాడు. పరుగుల వరద పారిన పిచ్‌పై కెప్టెన్ పాట్ కమిన్స్ (1/27) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
రాజస్తాన్ రాయల్స్ : 228/6 (వైభవ్ సూర్యవంశీ 103, ధ్రువ్ జురెల్ 51, ఫెరీరా 33, ఈషన్ మలింగ 2/38, పాట్ కమిన్స్ 1/27)
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 229/5 (ఇషాన్ కిషన్ 74, అభిషేక్ శర్మ 57, నితీశ్ కుమార్ 36, జోఫ్రా ఆర్చర్ 2/34, బ్రిజేశ్ శర్మ 2/44)
సన్‌రైజర్స్ సూపర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



