ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పనులకు శ్రీకారం
నవతెలంగాణ – నాచారం
నాచారం సర్కిల్ మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా వద్ద 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సమీపంలోనే అందించాలనే లక్ష్యంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అత్యవసర చికిత్స, ప్రసూతి సేవలు, సాధారణ వైద్య సేవలు, ల్యాబ్ పరీక్షలు వంటి విభాగాలు ఉండి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎస్సీ సునీత, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ , శ్రీనివాస్ రెడ్డి,అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
మల్లాపూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి భూమిపూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



