- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష శతమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మొదటిసారి ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మధుమోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కైలాస్ శ్రీనివాసరావు, వైశ్య సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



