Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంవిజయ్ ప్రచార వాహ‌నం సీజ్

విజయ్ ప్రచార వాహ‌నం సీజ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడులోని కరూర్‌లో తొక్కిసలాట ఘటనకు బాధ్యులను గుర్తించేందుకు చేపట్టిన దర్యాప్తును సీబీఐ (CBI) వేగవంతం చేసింది. నటుడు, రాజకీయనేత, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ (Vijay) ప్రచార వాహనాన్ని సీబీఐ సీజ్ చేసింది. ప్రచార వాహనం డ్రైవర్‌ సైతం సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 27న వేలుసామిపురంలో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సీబీఐ హెడ్‌కార్వర్టర్‌లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరుకావాలని విజయ్‌కు సైతం సమన్లు పంపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -