నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని దన్నూర్ మాజీ సర్పంచ్ విట్టల్ రావు ఐదవ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్నాటు చేశారు. ఇందులో గ్రామ యువత స్వచ్చదంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కోడలు జయశ్రీ దేవి దాస్ పటేల్, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. మామయ్యను మేమెప్పటికీ మరువలేమని, ఆయన మా గుండోల్లో ఉంటారి అన్నారు. సెవెన్ హిల్స్ బాన్సువాడ ఆస్పత్రి వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య చికిత్సలు జరిపించామని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో వైద్యురాలు వాగ్దేవి ఎండి జనరల్ మెడిసిన్, అదేవిధంగా డాక్టర్ దివ్య భవాని గైనిక్ ఫార్మసిస్ట్, సుమంత్ వీరితో పాటు వైద్య సిబ్బంది వైష్ణవి, నర్సుబాయి, కార్తీక్ హనుమంత్, అన్వర్ ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని ప్రజలకు చికిత్సలు అందించి, మెడిసిన్ ను అందజేశారు. అనంతరం సర్పంచ్ జయశ్రీ వైద్య బృందానికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, విట్టల్ రావు, రెడ్ క్రాస్ మండల చైర్మన్ ప్రకాష్ విట్టల్ రావు చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు.
ధన్నూర్ లో మాజీ సర్పంచ్ విట్టల్ రావు 5వ వర్ధంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



