నవతెలంగాణ – హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా జయంతుల స్ఫూర్తితో ఏప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటిస్తూ.. కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్ఎంఎం జాతీయ కార్యదర్శి బి.వి రాఘవులు మాట్లాడుతూ.. కుల రహిత సమాజంపై దేశవ్యాప్తంగా సాంస్కృతిక ఉద్యమాలను నిర్వహించాలని, అలాంటి ఉద్యమాలు నిర్మాణాత్మకంగా జరగాలని పిలుపునిచ్చారు. కష్టజీవుల నుండే పాట పుట్టిందని, అది అచ్చంగా కార్మిక వర్గానికి పరిమితం అవుతున్న నేపథ్యంలో ఆ పాటల్ని ప్రజలందరి పాటగా, ఆ మాటని కష్టా జీవుల మాటగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షత వహించగా ఎండి అబ్బాస్ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చెరుపల్లి సీతారాములు, ఎక్స్ ఎమ్మెల్సీ మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, రాష్ట్ర కార్యదర్శి జి రాములు, టిపిఎస్ కే రాష్ట్ర కన్వీనర్ పైళ్ల ఆశయ, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి టీ. నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి సలీమా, తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి విప్లవ్, నో కాస్ట్ ఇండియా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సాంస్కృతిక ఉద్యమాలు నిర్వహించాలి: బి.వి రాఘవులు పిలుపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



