Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలో కాంగ్రెస్ నాయకుల సందడి

ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలో కాంగ్రెస్ నాయకుల సందడి

- Advertisement -

నవతెలంగాణ-పరకాల
మండల కేంద్రంలోని 14వ వార్డుకు చెందిన సాయిని తేజశ్రీ-రజనీకాంత్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో నిర్మించుకున్న ఇంటి ప్రారంభోత్సవంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మార్క ఉమాదేవి-రఘుపతి గౌడ్, మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎండీ అలీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొక్కిరాల స్వాతి-తిరుపతి రావు, ఎండీ అమీనా, ఎండి షఫీయుద్దీన్ తదితరులు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, నూతన గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -