Tuesday, September 15, 2026
E-PAPER
Homeకరీంనగర్ప్రమాదవశాత్తూ బావిలో పడి బాలుడు మృతి

ప్రమాదవశాత్తూ బావిలో పడి బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-వెల్గటూర్
బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలోని లొత్తునూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్సాని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ (13) కుటుంబం సమీపంలోని లొత్తనూరుకు వివాహ వేడుకకు ఆదివారం వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు పెళ్లి అనంతరం ఊర్లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్తానికుల ద్వారా సమాచారం అందుకున్న బాలుడి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన బంధువులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే రితేష్ మృతి చెందాడు. మరోవైపు మృతుడి తండ్రి సంతోష్ ఏడాది క్రితం ప్రమాదవశాత్తు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. తాజాగా పెద్ద కుమారుడు రితేష్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి మమత బాలుడి పక్కన కూర్చుని రోధిస్తున్న ఘటన అక్కడున్నవారందరి మనసులను కలచివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -