నవతెలంగాణ-తుంగతుర్తి
రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మేడ్డుల రమేష్ అన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు కేసిఆర్ దూరదృష్టి,పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు యువత ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు ఏకమై పార్టీకి అండగా నిలిచారని గుర్తు చేశారు.
అనంతరం రాష్ట్ర ఏర్పాటు జరిగి సంక్షేమం, అభివృద్ధి రెండిటిని సమానంగా ముందుకు తీసుకెళ్లింది అన్నారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, మహిళలకు ఆర్థిక సహాయం, గ్రామీణ, పట్టణ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, ఉపసర్పంచ్ పాండవుల మహేష్, నిరంజన్ రెడ్డి, మెంతబోయిన సింహాద్రి, మల్లెపాక కరుణాకర్, వగలగాని విద్యాసాగర్ సత్యనారాయణ, వగలగాని రాము, మల్లెపాక శ్రీను, కొమ్ము కృష్ణ, సందీప్, వీరన్న, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.



