Monday, April 27, 2026
E-PAPER
Homeకరీంనగర్పిల్లలు చదువు, ఆటల్లో రాణించాలి: కలెక్టర్

పిల్లలు చదువు, ఆటల్లో రాణించాలి: కలెక్టర్

- Advertisement -

పిల్లలకు ఆటల పోటీల పరికరాల పంపిణీ
నవతెలంగాణ – తంగళ్లపల్లి

పిల్లలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాలల భద్రత.. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా, శిశు, దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఆద్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీ బాల్ కిట్లు పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల నృత్యం ఆలోచింపజేసింది.అంగన్వాడీ కేంద్రానికి పిల్లల ఎందరు వస్తున్నారు?రోజు పోషకాహారం ఇస్తున్నారా కలెక్టర్ ఆరా తీశారు? షి టీమ్ నంబర్ 87126 56425, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీ మానస్ 14416 హెల్ప్ లైన్ పై వివరించారు.

పిల్లల భద్రత.. అభివృద్ధి బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లదని పేర్కొన్నారు. పిల్లలు నిర్భయంగా మాట్లాడాలని తెలిపారు. తమకు నచ్చిన ఆటలు ఆడాలని, కచ్చితంగా చదవాలని తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇంట్లో తల్లికి సహాయం చేయాలని, తండ్రి వృత్తిని పరిశీలిస్తూ.. సహాయం చేయాలని వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాబ్యాసం చేయాలని, ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు.అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు కొలుస్తారని, ఎదుగుదల లోపించిన పిల్లలకు ప్రత్యేక వైద్యం, పోషకాహారం అందిస్తారని తెలిపారు.కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం,జిల్లా వైద్యాధికారి రజిత, తహసిల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ గాధగోని సాగర్, సీడీపీఓ ఉమారాణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -