Wednesday, April 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం

విమాన ప్రమాదంలో అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలి దుర్మరణం

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా ప్రతినిధి సభకు నార్త్‌ డకోటా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లిజ్‌ కాన్మీ (67) శనివారం మిన్నెపొలిస్‌ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పైలట్‌ కూడా చనిపోయాడు. ఒకే ఇంజిన్‌ కలిగిన ఈ చిన్న విమానం ‘బీచ్‌క్రాఫ్ట్‌ బీఈ 33’ మిన్నెసోటాలోని క్రిస్టల్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే పేలిపోయింది. లిజ్‌ తన రాష్ట్రానికి, సమాజానికి ఎనలేని సేవ చేశారని నార్త్‌ డకోటా గవర్నర్‌ కెల్లీ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని అంటూ ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. విమానం పేలిపోవడానికి ముందు అక్కడ ఉన్న చెట్లపై కూలిందని, ఈ ఘటనలో చెట్లు, గడ్డికి మంటలు వ్యాపించాయని సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్న ఓ సెక్యూరిటీ కెమెరాను బట్టి తెలుస్తోంది. కాన్మీ ఉత్తర డకోటా డెమొక్రటిక్‌-నాన్‌పార్టిసన్‌ లీగ్‌ పార్టీకి చెందిన వారు. ఇది డెమొక్రటిక్‌ పార్టీకి అనుబంధంగా ఉంటోంది. కాగా విమాన ప్రమాద ఘటనపై అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు విచారణ జరుపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -