Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచట్టపరమైన చర్యలు తీసుకుంటాం

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

- Advertisement -

అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయిస్తాం
అమెరికా, ఇజ్రాయిల్‌‌కు మొజ్తాబా ఖమేనీ హెచ్చరిక
​టెహ్రాన్:
ఇరాన్‌పై వరుసగా దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌పై ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరులను అంతం చేస్తున్న ఆ రెండు దేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు, ఇరాన్ ప్రముఖ నేతల వరకు ఎందరో పౌరుల మరణాలకు, వారిపై జరిగిన నేరాలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమన్నారు. వీరి మరణాలకు బాధ్యులను చేస్తూ వేలాది కేసులు నమోదు చేయనున్నట్టు ఖమేని తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. సాధారణ ప్రజల నుంచి దేశ అగ్రనాయకత్వం వరకు ఈ దాడుల్లో మరణించిన వారిని అమరులుగా అభివర్ణించారు. ఈ అంశంపై అమెరికా-జియోనిస్టులు (యూఎస్, ఇజ్రాయిల్ నేతలు) చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు తమకు ఆధారాలుగా ఉపయోగపడతాయని ఖమేనీ పేర్కొన్నారు. దీనివల్ల అంతర్జాతీయ కోర్టులలో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు వివరించారు. ఇరాన్ కోర్టులలో పోరాడుతుందన్నారు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంటే.. బదులుగా ఇరాన్‌పై అమెరికా వైమానిక దళం దాడులు చేస్తోంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే, శాంతి ఒప్పందం కోసం తీసుకుంటున్న చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అమెరికా హెచ్చరిస్తోంది. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -