Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంసౌదీలో ఘోరం

సౌదీలో ఘోరం

- Advertisement -

కూలిన అరాంకో హెలికాప్టర్
14 మంది మృతి
రియాద్‌ :
సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై అరాంకో సంస్థ ఇంకా స్పందించలేదు. అయితే, హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనకు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సౌదీ చమురు మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. సౌదీకి చెందిన చమురు సంస్థ అరాంకో 1934 నుంచి విమానయాన సేవలు కూడా అందిస్తోంది. 2023 నుంచి దీనికి సంబంధించిన సంస్థ పేరును అలౌలా ఏవియేషన్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ సంస్థకు విమానాలు, హెలికాప్టర్లు వంటివి కలిపి 60 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో తీర ప్రాంత రవాణా సేవలు, సరుకుల రవాణా, వైద్య పరమైన తరలింపు సేవలను సంస్త నిర్వహిస్తోంది. మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా ఆదివారం ఉదయం 11.00 గంటలకు విమాన ప్రమాదం జరిగింది. స్కైడైవర్ల బృందంతో వెళ్తున్న చిన్న విమానం కూలడంతో 11 మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు స్కైడైవింగ్‌ శిక్షకులు, ఐదుగురు విద్యార్థులు, పైలట్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -