Monday, June 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవెనిజులా భూకంపం లో 1,430కి చేరిన మృతుల సంఖ్య

వెనిజులా భూకంపం లో 1,430కి చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

శిథిలాల కింద వేలాది మంది
నేలమట్టమైన వందలాది భవనాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
కారకాస్ : వె
నిజులాలో ఇటీవల చోటు చేసుకున్న భూకంపాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం… ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,430కి చేరినట్టు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వందలాది భవనాలు కుప్పకూలడంతో వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ఆచూకీ లభించలేదు. దీంతో వారి జాడ తెలియక వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెనిజులాలో జూన్ 24 సాయంత్రం 6:04 గంటలకు కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే రెండు శక్తివంతమైన భూకంపాలు (7.2 మరియు 7.5 తీవ్రతతో) ఒకదాని వెనుక ఒకటిగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ జంట శక్తివంతమైన భూకంపాలు వెనిజులాను అతలాకుతలం చేశాయి.
​కొనసాగుతున్న సహాయక చర్యలు..
భూకంప తీవ్రతకు రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లోని నివాస సముదాయాలు నేలమట్టమయ్యా యి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తూ శిథిలాలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. నగరాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అంతర్జాతీయ సమాజం వెనిజులాకు మానవతా సహాయం అందించేందుకు ముందుకు వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -