Saturday, September 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేనొచ్చేశా !

నేనొచ్చేశా !

- Advertisement -

8 ఏండ్ల తర్వాత జులియన్‌ అస్సాంజే ‘ట్వీట్‌’
సిడ్నీ :
అమెరికా యుద్ధో న్మాద క్రూరత్వ ముఖాన్ని ‘వికీ లీక్స్‌’ పత్రాల ద్వారా ప్రపం చానికి చాటిచెప్పిన ఆ సంస్థ అధినేత జులియన్‌ అస్సాంజే ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం శుక్రవారం నాడు సామాజిక మాధ్యమాల్లో తిరిగి పోస్టు చేశారు. గతంలో ట్విట్టర్‌గా చలామణి అయిన ప్రస్తుత ‘ఎక్స్‌’ ఖాతాలో తన పేరుతో ఉన్న అధికారిక ఖాతాలో ‘ఐ యామ్‌ బ్యాక్‌’ (నేనొచ్చేశా!) అంటూ ఆయన పోస్టు చేశారు. సిడ్నీ వీధుల్లో ఒక గోడపై ఉన్న తన పోస్టరును చూపిస్తూ ఆయన ఒక చిత్రాన్ని కూడా జత చేశారు. కాగా ‘ఆయన తిరిగొచ్చాడు’ అంటూ ఈ నెల 17న వికీలీక్స్‌ సంస్థ ‘ఎక్స్‌’లో పేర్కొంది. అమెరికా అక్రమ కేసులు బనాయించడం, అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేయడం, ఈ దాష్టీకాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకడం వంటి పరిణామాల నేపథ్యంలో 2024 జూన్‌లో అస్సాంజే జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నిర్బంధంలో ఉన్నప్పటి నుంచే తనకు తాను స్వీయ నిషేదం విధించుకొని ఆయన సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన 2018లో చివరి సారిగా ఆయన ట్వీట్‌ చేశారు. కానీ ‘అస్సాంజేను కాపాడుకుందాం’ అనే పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఆయన బృందం పోస్టులు పెడుతూవచ్చింది. ఈ నేపథ్యంలో 8 ఏళ్ల విరామం తర్వాత ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ ఈ నెల 18న అస్సాంజే పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -