Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు చేసిన ధాన్యం తరలింపుపై నిర్లక్ష్యం

కొనుగోలు చేసిన ధాన్యం తరలింపుపై నిర్లక్ష్యం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంలోని కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేష్ గౌడ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీల సౌకర్యం లేకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ధాన్యం ఎక్కువ కాలం కేంద్రాల్లోనే నిల్వ ఉండడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాలు పడితే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రవాణా కోసం తగిన సంఖ్యలో లారీలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బొంకూరు మల్లయ్య, చీరాల బాలశంకర్, బీఆర్ఎస్ నాయకులు ఎండి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -