Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి తహశీల్దార్ కు ఘన సన్మానం

డోంగ్లి తహశీల్దార్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా రంజిత్ కుమార్ ఇటీవలే భాద్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం డోంగ్లి మండలంలోని ఎనబోరా గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు యూనుస్ పటేల్ తహశీల్దార్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు మీ సేవలు ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏనాబోరా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్సర్, నోవు పటేల్, పాల్గొన్నారు. అనంతరం ఆయనను సన్మానించిన ప్రతి ఒక్కరికీ తహశీల్దార్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -