– 30 పడకల ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ విఠల్
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న జుక్కల్ కేంద్ర 30 పడకల ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ విఠల్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉదయం నుండి పసుపోజియో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది తెలిపారు. మండలంలోని 30 గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామాలలో ప్రధాన క్రీడలలో ప్రయాణ ప్రాంగణాలలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లను చేసామని అన్నారు.
ఉదయం నుండి పోలియో చుక్కలను గ్రామాల వారీగా అందించడం జరిగిందని అనంతరం గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు , గ్రామపంచాయతీ కార్యదర్శులు , గ్రామ ప్రజాప్రతినిధులు సర్పంచులు గ్రామ మహిళా సంఘాల సభ్యులు పాల్గొని పోలియో చుక్కల వేసే కార్యక్రమాన్ని సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరు పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని అన్నారు. పోలియో చుక్కల వేసే కార్యక్రమంలో మండలంలోని 30 గ్రామ పంచాయతీల సర్పంచులు, బీపీ కార్యదర్శులు , జిపిఓ లు , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



