సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శంకర్
నవతెలంగాణ-మిడ్జిల్
రెండు పోలియో చుక్కలు పిల్లల నిండు ప్రాణాలు కాపాడుతుందని, పోలియో రైత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ కృషి చేయాలని సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో, తాండాలలో ప్రజా నివాస ప్రాంతాలలో ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలను వైద్య సిబ్బందితో కలిసి వేశారు. 140 మంది సిబ్బంది, 30 బూతులలో 99% పోలియో చుక్కలు వేసి నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శివకాంత్ , వైద్యాధికారి మీర్జా, సర్పంచులు చంద్రయ్య గౌడ్, శశికళ, గోపాల్, సుజాతమ్మ, రాములు, నాగరాజ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మంగమ్మ ,మన్నెమ్మ,రాములమ్మ, సిహెచ్ఓ ఆయుబ్, గీత ,పారిజాత ,పద్మ ,జ్యోతి, తిరుపతమ్మ ,నీలమ్మ , దేవయ్య, జంగయ్య , సంపత్ కుమార్ పాల్గొన్నారు.
నిండు ప్రాణానికి రెండు చుక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



