Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలుడిపై పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

బాలుడిపై పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఓ లేగదూడపై దాడి చేసిన ఘటన మరవకముందే నేడు బాలుడిపై దాడి చేశాయి. కాలనీలో అటుగా వెళ్తున్న మంగళవారం పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా బాలుడి కాలుపై కుక్క దాడి చేసింది. సమాచారం అందుకున్న బాలుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా.. మండలంలో పిచ్కికుక్కలను అదుపుచేయాలని, వాటి దాడిని అరికట్టాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -