– యూరియా కోసం రైతుల గోస తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్ : రైతు చేతిలో పంట ఉండాలి.. యూరియా కోసం బస్తా కోసం తిరిగే పరిస్థితి ఉండకూడదు. కానీ నేడు యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వారి బాధను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. గురువారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో పర్యటన సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతు పడిగే నర్సింలును నేరుగా కలిసి, యూరియా కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
పంట పండించేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం.. కానీ పంటకు అవసరమైన యూరియా కోసం కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుందా..?” అంటూ రైతు తన ఆవేదనను ఎమ్మెల్యే ముందు వ్యక్తం చేశారు.
రైతు కన్నీరు పెట్టే పరిస్థితి రావద్దని, రైతుకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.రైతు గోస విన్నారు. రైతు బాధను తెలుసుకున్నారు. రైతు కోసం నిలబడతానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
యూరియా కోసం రైతుల గోస.. కళ్లముందే రైతు కష్టం తెలుసుకున్న ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



