Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలికలకు భరోసాగా బాలసదనం 

బాలికలకు భరోసాగా బాలసదనం 

- Advertisement -

కన్నవారు లేకున్నా కంటికి రెప్పలా.. పోషణ 
నవతెలంగాణ-అచ్చంపేట
అమ్మ నాన్న లేని బాలికలను బాలసదనం అక్కున చేర్చుకొని భరోసా కల్పిస్తుంది. కన్నవారు లేకున్నా కంటికి రెప్పలా పెంచి పోషిస్తున్నారు. సమాజంలో గౌరవంగా బతకడానికి చదువు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు దూరమై భవిష్యత్ ప్రశ్నార్ధకమైన వారి పోషణ బాధ్యతను బాలసాధనం తీసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా వారికి తల్లిదండ్రుల్లాగా భవిష్యత్తుకు దశ దిశ చూపుతున్నారు. బాలసదనంను ప్రభుత్వం జిల్లాకు ఒకటి కేటాయిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అచ్చంపేటలో ప్రభుత్వం బాలసదనం నిర్వహిస్తోంది.

అచ్చంపేట నియోజకవర్గం కర్నూల్ జిల్లా.. ఇటు నల్గొండ జిల్లా..రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలకు విస్తరించి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో వివిధ గ్రామాలలోని  అమ్మ, నాన్న లేని ఎందరో బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను బాలసదనలో చేర్చుకుంటారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు అక్కడే ఉండి  చదువుకుంటారు. ఆరో తరగతిలో గురుకుల పరీక్షలు రాయించి సీటు వచ్చిన తర్వాత ఆ విద్యాసంస్థలో చేర్పిస్తారు. లేదంటే కస్తూరిభా గాంధీ పాఠశాలలకు పంపిస్తారు. ఆశ్రమ పాఠశాలలో వసతి కల్పిస్తారు. సెలవులలో వారు బాలసదనంకు వస్తారు. 10వ తరగతిలో నలుగురు, 9వ తరగతిలో నలుగురు, 8.వ తరగతిలో ముగ్గురు, 7.వ  తరగతిలో ఏడు మంది ఇలా మొత్తం 43 మంది బాలికలు ఆశ్రమం పొందుతూ చదువుకుంటున్నారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ కళాశాలలో అడ్మిషన్ చేస్తారు. అక్కడే ఉండి ఉన్నత చదువులు చదువుకుంటారు. సెలవు రోజులలో మళ్ళీ బాలసాధనంకు వస్తారు.

ఒక అమ్మాయి డిప్లొమా EEE  చదువుతుంది. మరో అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతుంది. సెలవులలో బాలసదనం వస్తారు. పదవ తరగతి పూర్తి కాగానే ఉపాధి కల్పించే కోర్సులపై ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బాలసదనలో విద్యార్థినిలలో నైపుణ్యతను బయటికి తీసేందుకు ఆటల పోటీలు నేర్పిస్తారు. వేసవి సెలవుల్లో క్రీడల పట్ల ఆసక్తి చూపేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బాలికలకు పోటీలు నిర్వహించి వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బహుమతులు సన్మానాలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.

ప్రత్యేకమైన ఆహారం అమలు: పట్టణంలోని బాలసదనం ఆశ్రమంలో ప్రభుత్వం ప్రత్యేకమైన అమలు చేస్తుంది. ఒక బాలికకు నెలకు రూ.3000/- చొప్పున నిధులు విడుదల చేస్తుంది. దింతో రాగి మాల్టు పాలు,  పొంగలి, పులిహోర, చపాతి, టమాట వెజిటేబుల్ రైస్, ఒక్కరోజు ఒక రకమైన అల్పాహారం బాలికలకు పెడుతుంటారు. అలాగే పండ్లు కూరగాయలు, ఆకుకూరలు ప్రత్యేకమైన రోజు మాంసంతో కూడిన మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం వడ్డిస్తారు.

ఉద్యోగులుగా కాకుండా తల్లిదండ్రులుగా చూసుకుంటున్నాం: భాగ్యమ్మ, బాలసదనం సూపర్డెంట్ 
అచ్చంపేట బాలసదనంలో 43 మంది విద్యార్థినీలు చదువుకుంటున్నారు. అమ్మ నాన్న లేని అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రోజువారీగా ఇంటి వద్ద నుంచి పిల్లలు ఏ విధంగా బడికి వెళుతున్నారో అదే పద్ధతిలో బాలసదనం నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి రావడం జరుగుతుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రత్యేకమైన మెనూ అమలు చేయడం జరుగుతుంది . వేతనం తీసుకుంటున్న ఉద్యోగులుగా కాకుండా వారికి తల్లిదండ్రుల్లాగా మనో ధైర్యం కల్పించి చదువుపై ఆసక్తి పెంచుతున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -