సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలు
నవతెలంగాణ-మద్నూర్
దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యమని సుల్తాన్ పేట్ అంబేద్కర్ జయంతి వేడుకలో వక్తలు పేర్కొన్నారు. మద్నూర్ మండలం లోని సుల్తాన్ పేట్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మరిభ, రామచందర్, అశోక్ కుమార్, బీమ్ రావు, శంకర్, బాలరాజ్, జైపాల్ గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



