-పెద్దవూర లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునికీకరించే దిశగా కీలక అడుగు వేసింది. అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించడమే. లక్ష్యంగా ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పెద్దవూర మండల కేంద్రం లోని అంగన్వాడీ కేంద్రం లో టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనుముల ప్రాజెక్టు ఏసీడీపీఓ సువర్ణ హాజరై స్మార్టు ఫోన్ల ను అందజేశారు.ఈ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా సేవల్లో వేగం పెరుగుతుందని అన్నారు.
గర్బిణీలు, బాలింతలు,పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలను ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా మరింత పారదర్శకంగా, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే వీలు కలుగుతుందని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అంగన్వాడీ టీచర్లు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.ప్రతి కార్యకర్త నిత్యం కేంద్రంలోని పిల్లల వివరాలు, పౌష్టికాహారం పంపిణీ, ఇతర సర్వేలను ప్రభుత్వానికి యాప్‌ల ద్వారా పంపించాల్సి ఉందని ఇలా పంపించేందుకు కార్యకర్తల వద్ద ఉన్న 3జీ, 4జీ పాత సెల్‌ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవు తున్నాయని తెలిపారు.దీంతో తమకు యాప్‌లకు సపోర్టు చేసే ఫోన్లను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 5జీ ఫోన్లను ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో లో సూపర్ వైజర్ శశికళ,అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.



