అదే బాటలో రేవంత్‌రెడ్డి సర్కార్ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడటౌన్
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిస్సిగ్గుగా అమలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఏండ్లు పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకొచ్చిందని తెలిపారు. దీని మూలంగా 8 గంటల పనిదినం, కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత పోతుందని, పర్మినెట్ ఉద్యోగాలు లేకుండా ఫిక్స్ టర్మ్ ఎంప్లాయిమెంట్ నియామకాలకు అవకాశం ఏర్పడుతుందని, కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైకి బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తూ.. అమల్లో మాత్రం వారి బాటలోనే నడుస్తోందని విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డేను మిర్యాలగూడ పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో నిర్వహించాలని, మే డే ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శనలు జరపాలని పిలుపునిచ్చారు. మే డేను నివాస ప్రాంతాల్లోనూ కార్మిక కుటుంబాలను కలుపుకొని ఎర్రజెండా ఎగురవేయాలని సూచించారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు మల్లేష్, గౌతమ్‌రెడ్డి, రామచంద్రం, రవినాయక్ ఉన్నారు.
కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



