Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీసుల ముట్టడి

ఎమ్మెల్యేల క్యాంప్‌ ఆఫీసుల ముట్టడి

- Advertisement -

మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
నవతెలంగాణ-నయీంనగర్‌/ ములుగు/దేవరకొండ

తమ సమస్యలు పరిష్కరించా లని, ప్రభుత్వ హామీలు అమలు చేయాలంటూ మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేల క్యాంప్‌ అఫీసులు, ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ యూనియన్‌ (సీఐటీ యూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హను మకొండ జిల్లా ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియం నుంచి వందలాది మంది మున్సిపల్‌ కార్మికులు భారీ ర్యాలీగా బయలుదేరారు. సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఇంటి ఎదుట మహా ధర్నా చేపట్టారు.కార్మికులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సుబేదారి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కార్మికులు ఎమ్మెల్యే ఇంటి బయటే రెండు గంటలపాటు బైటాయించి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సీసీకి తమ వినతిపత్రాన్ని అందజేశారు.
కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కలెక్టర్‌ స్పందించి డీపీఓ వెంకయ్య, ఏవో రాజ్‌కుమార్‌ను ఆందోళనకారుల వద్దకు పంపించారు. వినతిపత్రం స్వీకరించిన అధికారులు.. జులై ఒకటో తారీకు వరకు పెండింగ్‌ వేతనాలు మొత్తం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
దేవరకొండలో..
కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి పర్మినెంట్‌ చేయాలని కోరుతూ దేవరకొండ మున్సిపల్‌ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -