Tuesday, June 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతే దేశానికి వెన్నెముక

రైతే దేశానికి వెన్నెముక

- Advertisement -

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
సర్‌తో అర్హత ఉన్న ఒక్క ఓటు పోకుండా చూడాలి ఎరువుల తయారీ రాష్ట్రాల చేతిలో లేదు
కేంద్రం ఇస్తేనే పంపిస్తున్నాం
కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ -కోహెడ

రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. బస్వాపూర్ గ్రామ పెద్దమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కూరెళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. అలాగే మండల కేంద్రంలో సార్ కార్యక్రమాన్ని ప్రారంభించి బీఎల్‌వో, బీఎలఏలకు తగు సూచనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ మండలాధ్యక్షులు శెట్టి సుధాకర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2002, 2025 ఓటరు జాబితా అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని బీఎల్‌వోలకు సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 60 వేల ఓట్లు తటస్థంగా ఉన్నాయని, రాష్ట్రంలో దాదాపు కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయని తెలిపారు. ప్రూఫ్ చూపెట్టి ఓట్లు పోకుండా చూసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు మన ఆయుధం అని, ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మండలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు నడుస్తున్నాయని, బస్వాపూర్ నుంచి తంగళ్ళపల్లి, రాంచంద్రాపూర్ రోడ్డు మంజూరయ్యాయని తెలిపారు. హుస్నాబాద్‌లో ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, రెండవ దశలో మరిన్ని వస్తున్నాయని తెలిపారు. మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతో స్టీల్ కిట్స్, 540 హోటళ్లకి స్టీల్ గ్లాస్‌లు ఇచ్చామన్నారు. ఎరువుల తయారీ రాష్ట్రాల చేతిలో లేదని, కేంద్రం ఇస్తేనే మనం పంపగలగుతున్నామన్నారు. ఎరువులు ఎంత అవసరమో అంతే వేయాలని కేంద్రం సూచిస్తుందని తెలిపారు.

దుక్కి దున్ని.. విత్తనాలు చల్లి..
కూరెళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులతో కలిసి మంత్రి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను వినియోగించాలన్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మెన్ బోయిని నిర్మల జయరాజ్, సర్పంచ్‌లు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -