Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనవతెలంగాణ వనపర్తి డివిజన్ 
ఇన్‌చార్జికి మాతృవియోగం

నవతెలంగాణ వనపర్తి డివిజన్ 
ఇన్‌చార్జికి మాతృవియోగం

- Advertisement -

నివాళులర్పించిన సిబ్బంది, సీపీఐ(ఎం) నేతలు
నవతెలంగాణ -వీపనగండ్ల /వనపర్తి

వనపర్తి జిల్లా నవతెలంగాణ డివిజన్ ఇన్‌చార్జి అక్కి బాబు తల్లి బక్కి ఉషమ్మ అనారోగ్యంతో హైదరాబాదు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సోమవారం చిన్నంబాయి మండల పరిధిలోని దగడపల్లి గ్రామంలో ఉషమ్మ మృతదేహానికి నవతెలంగాణ జనరల్ మేనేజర్ వెంకటేశ్, మహబూబ్‌నగర్ రీజియన్ మేనేజర్ ఎం కార్తీక్, ప్రాంతీయ ప్రతినిధి ఏ పరిపూర్ణం, డెస్క్ ఇన్‌చార్జి భాస్కర్, సమన్వయ కమిటీ సభ్యులు బి.దీలీప్ కు మార్, మహబూబ్‌నగర్, నారాయణపేట డివిజన్ ఇన్‌చార్జీలు ప్రవీణ్, కుమార్, వనపర్తి విలేకరి జె.రాములు, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, 18 వ వార్డు సీపీఐ(ఎం) కౌన్సిలర్‌ గంధం మదన్, పట్టణ నాయకులు బీసన్న, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -