ఉద్యోగి మృతి, 30 మందికి గాయాలు
సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలంపూర్ విజయుడు
నవతెలంగాణ- పెబ్బేరు
జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో ఒకరు మృతిచెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రం సమీపంలోని రంగాపూర్ జాతీయ రహదా రిపై సోమవారం ఉదయం జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివ రాల ప్రకారం..వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంత్రాలయం నుంచి కర్నూ లు మీదుగా వనపర్తికి వస్తోంది. పెబ్బేరు శివారులోని నేషనల్ హైవేపై డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అదుపుతప్పి మలు పు తిరిగి పక్కనే ఉన్న డివై డర్‌పై బోల్తా పడింది. దీంతో ప్రయాణికు లంతా ఒక్కసారిగా భయాం దోళనకు గురయ్యారు. వారంతా సీట్ల మధ్యలో ఇరుక్కున్నారు. ఇతర వాహనాల వారు, స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్ గౌడ్ తన బందంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో సీట్ల మధ్య ఇరుక్కున్న వారిని బయటకు తీసి పోలీసు వాహనాల్లో పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సైతం ప్రమాద ఘటనను చూసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 61 మంది ప్రయాణికులు ఉండగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శివప్రసాద్‌కు తీవ్రగాయాలు కాగా నేషనల్ హైవే అంబులెన్స్‌లో కర్నూలు కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. డీఎస్పీ గిరిబాబు, సీఐ రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రయాణికులను మున్సిపల్ చైర్మెన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, తహసీల్దారు సత్యనారాయణ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు పెబ్బేరు ఎస్‌ఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సు బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



