Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తి

క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలకు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎస్కేఎం, కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన జైల్‌‌భరో కార్యక్రమం విజయవంతమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ ప్రకటించారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేసిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో 60 నుంచి 70 వేల మంది జైల్‌‌భరో నిరసనల్లో పాల్గొన్నారని తెలిపారు. అందులో 15 వేల మంది దాకా అరెస్టయ్యారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో గల ఎన్‌‌డీఏ ప్రభుత్వం తాను అనుసరిస్తున్న కార్మిక, కర్షక, కూలీల వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు స్వామినాథన్‌ ‌కమిషన్‌ ‌సూచించినట్టుగా సీటూ+50 శాతం నిర్ణయించి పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రయివేటీకరణను వెనక్కి తీసుకోవాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలనీ, రైతులకు నష్టదాయకంగా మారిన విద్యుత్‌ ‌ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలను విడనాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -