Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి

- Advertisement -

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – ముషీరాబాద్​

​దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరిమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కోరారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం ఆల్ ఇండియా క్రిస్టియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులు నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన దళితుల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం, వివక్ష పూర్తిగా తొలగిపోవన్నారు. ఈ అంశాన్ని జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికలో కూడా ప్రస్తావించిం దన్నారు. మతంతో సంబంధం లేకుండా అర్హులైన దళితులకు షెడ్యూల్ కులాల హోదా కల్పించాలని, కమిషన్ సిఫార్సుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత క్రైస్తవుల సమస్యపై స్పష్టమైన వైఖరితో స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దళిత క్రైస్తవ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లభించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం అశోక్, స్టాలిన్, రాజశేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -