Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆటోడ్రైవర్లకు మద్దతుగా 12న టీఆర్టీయూ మహాధర్నా

ఆటోడ్రైవర్లకు మద్దతుగా 12న టీఆర్టీయూ మహాధర్నా

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆటోడ్రైవర్లకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) ఆధ్వర్యంలో ఈనెల 12న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు ఎల్.రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసేలా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మహాధర్నాకు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల సాయం చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని రూప్ సింగ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు వందల మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -