Thursday, April 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపదో తరగతి ఫలితాల్లోబీసీ గురుకుల విద్యార్థుల విజయదుందుభి

పదో తరగతి ఫలితాల్లోబీసీ గురుకుల విద్యార్థుల విజయదుందుభి

- Advertisement -

98.99శాతం ఉత్తీర్ణత,
రెండో స్థానంలో బీసీ గురుకులాలు
204 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
అత్యధికంగా 588 మార్కులు
సాధించిన నితీషా, శ్రీనిధి
587 మార్కులు సాధించిన
సాయిమనోజ్‌ రెడ్డి, లాస్య
580 కన్నా ఎక్కువ మార్కులు
సాధించిన 60 మంది
570కి పైగా మార్కులు సాధించిన
364 మంది విద్యార్థులు
3598 మంది విద్యార్థులకు
90 శాతానికి పైగా మార్కులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించి విజయఢంకా మోగించారు. అత్యధిక మార్కులు 588 ఇద్దరు బాలికలు నితీషా, శ్రీనిధి సాధించగా, 587 మార్కులు సాయి మనోజ్‌ రెడ్డి, లాస్య సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ ఏడాది బీసీ గురుకుల విద్యార్థులు 98.99 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 4.84 ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 పాఠశాలల నుంచి 204 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 60 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు, 570 కంటే ఎక్కువ మార్కులు 364 మంది విద్యార్థులకు రాగా, 560 కంటే ఎక్కువ మార్కులు 1,061 మంది విద్యార్థులు సాధించి తమ ప్రతిభను చాటారు. 3,598 మంది విద్యార్థులు 90 శాతం పైగా మార్కులతో తమ సత్తా చాటారు. ఈ ఏడాది 19,245మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 19,047 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో 9,093 మంది బాలురు, 9,954 మంది బాలికలు ఉన్నారు.

బీసీ సంక్షేమ వసతి గృహాల ఉత్తీర్ణతా శాతం 96.05
రాష్ట్రంలోని బీసీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో 365 ప్రీ-మెట్రిక్‌ బీసీ హాస్టల్స్‌ నుంచి పరీక్షలకు 4,941 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 4,746 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో బీసీ సంక్షేమ వసతి గృహాల ఉత్తీర్ణత శాతం 96.05గా నమోదు అయ్యి ంది. ఇందులో 285 వసతి గృహాల విద్యా ర్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. అన్ని జిల్లాల్లోని హాస్టల్స్‌ 90 శాతం కన్న ఎక్కువ ఉత్తీర్ణత సాధించగా ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, ములుగు జిల్లాలు 100 శాతం ఫలితాలను సాధించాయి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, బోధనా సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ గురుకుల సోసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -