నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం బుధవారంతో ముగిసింది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో 23న, బెంగాల్లో తొలి విడత 23న, 29న రెండో దఫా పోలింగ్ ముగిసింది. దీంతో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ హంగామ మొదలైంది. ఆయా సర్వే సంస్థలు పలు అంచనాలతో తమ జోస్యాన్ని వెల్లడించాయి. తమిళనాడలో డీఎంకే జోరు కొనసాగునుందని యాక్సిస్ ఇండియా, పి-మార్క్, మాట్రిజ్, పిపుల్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్ తదితర ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. టీవీకే అధినేత విజయ్, అన్నా డీఎంకే ఆయా పార్టీలు మోస్తారు అధిక్యాన్ని కనబర్సుస్తాయని వెల్లడించాయి.
కేరళలో యూడీఎఫ్, ఎల్డీడీఎఫ్ మధ్య టప్ నెలకొందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం మీద మరోసారి పినరయి విజయన్ అధికార పగ్గాలు చేపట్టనున్నాయని దీమా వ్యక్తం చేశాయి. 140 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ పిగర్ కైవసం చేసుకోనుందని పేర్కొన్నాయి.
పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే. తొలి,రెండో విడత ఎన్నికల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ అధిక సంఖ్యలో టీఎంసీ అధికారంలోకి రానుందని అభిప్రాయపడ్డాయి.
అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య టఫ్ పైట్ నెలకొందని, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రానుందని అధిక ఎగ్గిట్ పోల్స్ వెల్లడించాయి. ఏది ఏమైనాప్పటికి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా..ప్రజా తీర్పు మే 4న వెలువడనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల భవిత్యం తెలనుంది.



