- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎనిమిదేళ్ల తర్వాత చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 78 సంఘాలకు జూలై 10న బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 13,708 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్లు జూలై 2 నుంచి 4 వరకు స్వీకరిస్తారు. పోలింగ్ అనంతరం అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
- Advertisement -



