Thursday, April 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదిలో మోడ్రన్ హైస్కూల్‌ విద్యార్థుల అద్భుత ప్రతిభ

పదిలో మోడ్రన్ హైస్కూల్‌ విద్యార్థుల అద్భుత ప్రతిభ

- Advertisement -

ఒకే పాఠశాల నుంచి టాప్ ఫలితాలు 
500కు పైగా మార్కులతో 22 మంది విద్యార్థులు
నవతెలంగాణ-నాచారం

నాచారం సర్కిల్ మల్లాపూర్ సూర్యనగర్ కాలనీలోని మోడరన్ హై స్కూల్ ఎస్‌ఎస్‌సి-2026 ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. సెమీ రెసిడెన్షియల్ విధానంలో, సీబీఎస్ఈ నమూనాలో విద్యను అందిస్తున్న ఈ పాఠశాల, కార్పొరేట్ పాఠశాలలకు సాటి ఫలితాలు సాధించడం గమనార్హం. ఈ ఏడాది పరీక్షల్లో జీ. లయ వర్ధన్ సాయి 600/584 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఎ. సాయి ప్రసన్న 563 మార్కులు, వి. నవదీప్ 536 మార్కులు, గౌతమ్ ఋషి 534 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు. అదనంగా, 500కు పైగా మార్కులు సాధించిన 22 మంది విద్యార్థులు ఉండటం పాఠశాల ప్రతిష్టను మరింత పెంచింది.

ఈ సందర్భంగా ,హెడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసన్నం ,కరస్పాండెంట్ సాచి దేవి, ఫౌండర్ చైర్మన్లు జి ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి కారణమని తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిబద్ధత వల్లే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.“విజేతలు పుట్టుకతో రారు… వారు మోడరన్ హై స్కూల్‌లో తయారవుతారు” అని యాజమాన్యం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -