– రాజపురం సబ్ స్టేషన్ మంజూరు
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి : మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో గల సబ్ స్టేషన్ న్ని తెలంగాణ రాష్ట్ర యన్పిడిసియల్ సిఎండి వరుణ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి సబ్ స్టేషన్ న్ని పరిశీలించారు.విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది అని నేరుగా చూసారు.మండలంలో నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందిస్తున్న ఏఈ తరుణ్ నీ అభినందించారు.మండల పరిధిలోని రాజపురం గ్రామంలో నూతంగ మంజూరు అయిన సబ్ స్టేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.సబ్ స్టేషన్ మండలంలో రెండు ఉండటం వలన మండల ప్రజలకు విద్యుత్ సమస్యలు తీరుతాయి అని అన్నారు.రాజపురం గ్రామానికి 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు చేయడం పట్ల గ్రామ పెద్దలు భీమిరెడ్డి రామిరెడ్డి,శ్రీనివాసరెడ్డి,దుబాకులరాము,గణపతి రెడ్డి, చినముత్యం,బన్నె చెన్నారావు సిఎండి వరుణ్ రెడ్డి ని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మహేందర్,డీఈ రంగస్వామి, ఏడీఏ రవికుమార్,అన్నపురెడ్డిపల్లి ఏఈ తరుణ్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి సబ్ స్టేషన్ తనిఖీ చేసిన సీఎండీ
- Advertisement -
- Advertisement -



