- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి: ఎర్రజెండా అందరికీ అండగా నిలుస్తుందని సిపిఐ(ఎం) గిద్ద పార్టీ శాఖ కార్యదర్శి మొగులయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని గిద్ద, రామారెడ్డి తదితర గ్రామాల్లో మే డే దినోత్సవాన్ని ఎర్రజెండా ఎగరవేసి, అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులు తమ హక్కులు సాధించుకోవాలంటే ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాటాలు చేయవలసిందేనని, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటంలో ఎర్ర జెండా పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో జిపి కార్మికులు శ్రీధర్, గంగరాజు, రాజయ్య, సాయిలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



