Friday, May 1, 2026
E-PAPER
Homeజిల్లాలుశ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు.. హాజరైన మాజీ ఎంపీ బీబీ పాటిల్

శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాలు.. హాజరైన మాజీ ఎంపీ బీబీ పాటిల్

- Advertisement -
  • ఆలయంలో ప్రత్యేక పూజలు
    నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నారాయణ రథోత్సవాల్లో భాగంగా జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఉత్సవాలకు హాజరయ్యారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవ వీడియోను విడుదల చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రత్యేకంగా భక్తులకు అన్నదానం వడ్డించారు. ఉత్సవాలకు హాజరైన మాజీ ఎంపీ బీబీ పార్టీలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించి, ఆలయ ఫోటోను బహూకరించారు. మాజీ ఎంపీ బిబి పాటిల్ గడిచిన రెండు సంవత్సరాలు మహా అన్నదానాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది ప్రత్యేకంగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయన హాజరైనందుకు ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎంపీ బీబీ పార్టీలు వెంట బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్ప తుకారాం, చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు, ఆ పార్టీ నాయకులు కంచిన్వార్ యాదవ రావు, గ్రామ పెద్దలు పాకల విజయ్ హనుమాన్లు స్వామి, కంచిన్ వార్ హనుమాన్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -