- Advertisement -
- అంతర్జాతీయ మేడే వేడుకల్లో సీపీఐ(ఎం)
నవతెలంగాణ-బెజ్జంకి: కార్మిక,కర్షక,బడుగుల జీవనానికి ఎర్ర జెండానే ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో సీపీఐ(ఎం),సీఐటీయూ అనుబంధ సంఘాల అధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులు సీఐటీయూ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణి చేసి పండుగల జరుపుకున్నారు.సర్పంచ్ బొల్లం శ్రీధర్,సీఐటీయూ మండలాధ్యక్షుడు బోనగిరి పర్శరాములు, సీపీఐ(ఎం)నాయకులు బొమ్మిడి సాయికృష్ణ,బోనగిరి లింగం,ఎస్టీయూజిల్లా ఆర్థిక కార్యదర్శి రామంచ రవీందర్,అనుబంధ సంఘాల కార్మికులు,స్థానికులు పాల్గొన్నారు.
- Advertisement -



