రెండు నెలల్లోనే రూ.1303 పెంచడం దారుణం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను అమాంతం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజ లపై యుద్ధం ప్రకటించడమేననీ, కేవలం రెండు నెలల్లోనే సిలిం డర్ ధరను రూ. 1,303 పెంచి ప్రజల నడ్డి విరచడం దారుణమ ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించింది. పెంచిన ధరను తక్షణమే ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఇంధన నిల్వలకు కొరత లేదనీ, అంతా బాగుందని ప్రజలను నమ్మబలుకుతూనే, మరోవైపు దొంగచాటుగా భారీ ఎత్తున భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ ధరను మార్చిలో రూ. 115, ఏప్రిల్‌లో రూ. 195 పెంచిన కేంద్రం, ఇప్పుడు ఒక్కసారిగా రూ.993, ఇలా రెండు నెలల వ్యవధిలో రూ.1,303 పెంచడం దారుణమని పేర్కొన్నారు.తాజా పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ. 3,315కు చేరడం ఆందోళనకరమని తెలిపారు. ఈ ధరల పెరుగుదల వల్ల చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారం చివరికి సామాన్య వినియోగదారులపైనే పడుతుందని తెలిపారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం, హార్మూజ్ జలసంధిలో అంతరాయాలను సాకుగా చూపి దేశీయంగా ప్రజలపై భారీగా ధరలు పెంచడం సమర్థనీయం కాదనీ, ఇది కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చడమేనని విమర్శించారు.
గ్యాస్ ధరను తగ్గించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



