హక్కులు ఇచ్చేవి కావు-పోరాడి సాధించాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రంగారెడ్డి అన్నారు. మేడే సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో ముందు భాగాన రంగారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి సలీం తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన ముందుభాగంలో ఎర్ర చీరలు కట్టుకున్న మహిళలు కోలాటాలు వేసుకుంటూ అత్యంత ఉత్సాహంగా ప్రదర్శన చేశారు. ప్రదర్శన స్థానిక సీఐటీయూ కార్యాలయం నుండి సాగర్ ప్రధాని మీద కూడా రౌండ్ వద్దకు చేరుకుంది. వేలాది మందితో జరిగిన ఈ ప్రదర్శన చూపుర్లను ఆకట్టుకున్నది. మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. సూర్యాపేటలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. నాటి అమరుల త్యాగాలపలమే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పునరుద్ఘాటించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలకేంద్రంలో సీఐటీయూ జెండాను ఎగురవేశారు.
మిర్యాలగూడలో కార్మికుల మహా ప్రదర్శన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



