వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ పిలుపు నిచ్చారు. మేడేను పురస్కరించుకుని హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో గల తెలంగాణ స్ట్రేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. రైతు సంఘాలను కలుపుకుని విద్యుత్ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలన్నారు. టీఎస్‌యూఈఈయూ రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు మాట్లాడుతూ ఆర్టిజెన్స్ కన్వర్షన్, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, వి.గోవర్దన్, కే.సత్యం, ఏ.కిరణ్ కుమార్, ఇ.రమేష్, ప్రసాద్ రాజు, జయశ్రీ ఫయాజుల్లా ఖాన్, ఆంజనేయులు, ఆనంద్, సైదులు గౌడ్, కత్తి శీను, జి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



