ఉపాధి కూలీలను పనులకు దూరం చేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర

– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూలీలను ఉపాధి పనులకు దూరం చేసే కుట్ర చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం రామారావుపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి కూలీలతో మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధిని కార్మికులకు లేకుండా చేయాలని చూస్తుందన్నారు. అదే విధంగా బిఆర్‌ఎస్‌, బిజెపికి అనుకూలంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఎనాడు ఉపాధి పని గురించి నోరు మెదపలేదని అందుకోసం భద్రాచలం నియోజకవర్గంలో సిపిఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యని గెలిపించాలని, సుత్తి కోడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలన్నారు. భద్రాచలం ఎమ్మెల్యేగా పోదేం వీరయ్య 2018లో గెలిచిన తర్వాత ఒక్క గ్రామానికి కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో సందర్శించలేదన్నారు. తెల్లం వెంకట్రావు రెండు సార్లు ఓడి ప్రజాక్షేత్రంలో ఉండలేదని మరల ఓట్లు కోసం వచ్చాడు.. తప్ప పది సంవత్సరాలలో మా ప్రాంతానికి రాలేదు అని ప్రజలు చెప్పుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బిఆర్‌ఎస్‌ అభ్యర్థి డబ్బులు పంచితే తీసుకొని సిపిఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్య గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేస్తామని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. నేను తిరిగిన గ్రామాలలో ఏ ఒక్క గ్రామానికి కూడా వీళ్ళిద్దరూ రాలేదని ఇప్పుడు ఓట్లు కోసం వస్తున్నారని తెలిపారు. బండారు గుడెం, వైట్‌ నాగారం, సింగారం, ఎన్‌ లక్ష్మి పురం, మారేడుబాక, తూరుబాక, చిలకదంతేనం, నరసాపురం, సీతారాంపురం దంతనం డబ్ల్యు రేగుబల్లి, కె. రేగుబల్లి, నడికుడి గ్రామాల ప్రజలు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేద్దామని ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేది సిపిఐ (ఎం)ని గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ష చిన్నారావు, సోడె శ్రీను, వీరస్వామి, బాబురావు, రాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love