ప్రజా సమస్యలపై పోరాడుతున్న అభ్యర్థిని ఆశీర్వదించండి

– సీపీఐ(ఎం) అభ్యర్థికి వీరభద్రంకు జూలూరుపాడులో ఘన స్వాగతం
నవతెలంగాణ-జూలూరుపాడు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అభ్యర్థిని ఆశీర్వదించాలని సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రం కోరారు. మండలంలో ప్రజాసంఘాలు బలపరిచిన భూక్యా వీరభద్రం సోమవారం జూలూరుపాడు మండలంలోని విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలకే పరిమితమైన ప్రభుత్వం ఒక్క నిరుద్యోగికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులు ఆలోచించి ఓటేయాలన్నారు. పోడు భూముల కోసం పోడు పట్టాలు వచ్చేంతవరకు ఎన్నో నిర్బంధనలు ఎదుర్కొని జైళ్లకు వెళ్లి చావుని సైతం లెక్కచేయకుండా పోరాడినటువంటి ఘనత కేవలం ఎర్రజెండాలదే (సీపీఐ(ఎం)) అని తెలిపారు. మిగిలిన అటువంటి పోడు భూములకు కూడా పట్టాలు ఇచ్చేంతవరకు మీ అందరూ ఆదరిస్తే అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామ చెప్పారు. ప్రతి పేదవాడికి ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు సీపీఐ(ఎం) జండాను పట్టుకొని పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీ స్కీములతో మోసపూరిత హామీలు ఇస్తుందని తెలిపారు. 60 ఏళ్ల పాలల్లో పేదలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ప్రజలు మోసపోవద్దని సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల కోసం తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి భూక్య వీరభద్రం అన్నారు. వైరా నియోజకవర్గ పట్ల సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి వీరభద్రమన్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, భూమిలేని ప్రజలకు భూమి పంచుతామని, డబల్‌ బెడ్‌ రూములు ప్రభుత్వ మెడలో వంచి తెస్తామని, ప్రజా సమస్యలు పరిష్కారాన్ని దిశగా పోరాడుతామన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య పేద ప్రజలకు వైద్యం లాంటివి ఉచితంగా అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాస నరేష్‌, మండల కమిటీ సభ్యులు నల్లమల్ల చందర్‌ రావు, లకావత్‌ శ్రీను, బానోత్‌ మదు, గార్లపాటి వెంకటి, బానోత్‌ ఇస్రా నాయక్‌, మాలోత్‌ రాములు, ఊడల వెంకటేశ్వర్లు, పెరుమల వెంకటి, గడిదేసి కనకరత్నం, పద్దం సుగుణ, తాటి పద్మ, సీతారాములు, గార్లపాటి పవన్‌ కుమార్‌, బోడ అభిమిత్ర, యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love